వయసు యాభై దాటితే మీ దినచర్యలో బాడీ మసాజ్ కూడ చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 45 నుంచి 50 దాటితే శరీరం లోపల ఉండే భాగాల ఎదుగుదల ఆగిపోయి అరుగుదల క్రమంగా మొదలవుతుంది. ఫలితంగా పని సామర్థ్యం తగ్గి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ వంటి రుగ్మతలు వేధిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే రెగ్యులర్ బాడీ మసాజ్ చాలా అవసరం.