రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందంటూ నానా యాగీ చేసి, ఇప్పుడు అవే పథకాలు రెట్టింపు ఇస్తామంటూ టీడీపీ మభ్యపెడుతోందన్నారు హోం మంత్రి తానేటి వనిత. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఎదుర్కొనే సత్తాలేకనే విపక్షపార్టీలన్నీ కలిసి కూటమిగా వస్తున్నాయన్నారు. 2014లో అసత్యాలు చెప్పి అధికారంలోకొచ్చినట్లే మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు తానేటి వనిత.