కొవిడ్ తో భర్త మృతి.. రెండేళ్ల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన భార్య..! @Tv9telugudigital

పశ్చిమబెంగాల్‌లోని భీర్‌భూమ్‌ జిల్లాలో కొవిడ్‌తో మరణించిన భర్త వీర్యం ఆధారంగా ఓ మహిళ నడివయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐవీఎఫ్‌ పద్ధతిలో జరిగిన ఈ ప్రక్రియ అనంతరం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మురారై ప్రాంతానికి చెందిన సంగీత, అరుణ్‌ప్రసాద్‌లకు 27 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంగీతకు గర్భాశయ సమస్యలు ఉండటం వల్ల చాలా ఏళ్లు సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్‌ విధానంలో పిల్లల్ని కనాలని దంపతులు నిశ్చయించుకున్నారు. ఆ మేరకు రెండేళ్ల క్రితం అరుణ్‌ప్రసాద్‌ వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. ఆ తర్వాత అరుణ్‌కు కొవిడ్‌ సోకి మరణించారు. భర్త మరణంతో సంగీత కుంగిపోయింది. అత్తింటివారు పట్టించుకోలేదు. అరుణ్‌ నడిపిన కిరాణం దుకాణమే ఆమెకు ఆధారమైంది. ఒంటరిగా మారిన సంగీత.. భద్రపరచిన భర్త వీర్యం సాయంతో బిడ్డను కనాలని నిర్ణయించుకుంది.