ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. రకరకాల పద్ధతులను ఉపయోగించి టన్నెల్ డ్రిల్లింగ్ చేశారు. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నిటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ చివరికి 41మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీం..