Mahesh Babu ఈ 23 థియేటర్లకు.. మహేష్ ముందుగా వస్తున్నాడోచ్! - Tv9

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కించారు గురూజీ. గుంటూరు కారం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పై ఇప్పటి భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జనవరి 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గుంటూరుకారణ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.