కిరణ్ అబ్బవరం సినిమాకు దిమ్మతిరిగే వసూళ్లు

పెళ్లి తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మొదటి సినిమా క. సుజీత్, సందీప్ తెరెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన విడుదలైంది. ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి. అల్లు అరవింద్ లాంటి ప్రముఖులు ఈ సినిమాను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతున్నారు. ఇలా అన్ని చోట్ల క సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.