మనం ప్రయాణించాల్సిన బస్సు సమాచారం తెలిపే గమ్యం యాప్‌ను టీఎస్ఆర్‌టీసీ ఏడాది క్రితం అందుబాటులోకి తెచ్చింది. కానీ, ఈ యాప్ కేవలం ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఎలక్ట్రిక్ బస్సులకు మాత్రమే పరిమితమైంది. మిగతా వాటిలో దీని జాడ లేదు. మొదట దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులకు గమ్యం యాప్ అనుసంధానించారు. ఆ తర్వాత నగరంలో తిరిగే అన్ని బస్సులకు అమర్చాలని ప్రయత్నించారు.