సముద్ర గర్భాలు ఎన్నో అంతుచిక్కని అద్భుతాలకు నిలయాలు. సైంటిస్టులు వీటిపై నిరంతరం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే సముద్ర గర్భంలో దాగున్న ఎన్నో అద్భుతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహాసముద్రంలో ఇసుక రోడ్డు ఒకటి బయటపడింది. 2022లో ఓషన్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌కు చెందిన శాస్త్రవేత్తలు పసిఫిక్ మహా సముద్రంలో పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా ఓ మిషన్‌ను సముద్రంలో 3 వేల మీటర్ల లోతుకు పంపారు. ఆ మిషన్ లావాకు సంబంధించిన వాటిని తవ్వుతూ ఉంది. ఆ దృశ్యాలను మిషన్‌కు అమర్చిన కెమెరా ద్వారా నీటిపైన ఉన్న సైంటిస్టులు లైవ్‌లో చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వారికి ఓ విచిత్రమైన ప్రదేశం కనిపించింది.