తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టెన్త్, ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్ధులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. చెన్నైలోని తిరువన్‌ముయార్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై విద్యార్థులకు నటుడు విజయ్ సందేశం ఇచ్చారు.