దీపావళి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ రోజున లక్ష్మీ దేవి, గణపతి పూజించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అమావాస్య చీకటిని దీపాల వెలుగుతో పారద్రోలుతూ దేదీప్య మనంగా వెలిగేలా ఈ పండుగను జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టితో చేసిన లేదా లోహపు లక్ష్మీ , గణేషుల విగ్రహాలను కొనుగోలు చేస్తారు. అన్ని దేవుళ్ల విగ్రహాలు మంచివిగా భావించినప్పటికీ జ్యోతిష్యులు దీపావళి పూజకు ప్రత్యేక విగ్రహాన్ని కొనుగోలు చేయాలని చెప్పారు.