దుబాయ్‌లో బంగారం ఎందుకు చవక ఎంత బంగారం తెచ్చుకోవచ్చు

భారత్‌లోకి బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా దుబాయ్‌ నుంచే జరుగుతుంది. కారణం ఏంటి? ధర ఎందుకు అక్కడ తక్కువ? తాజాగా కన్నడ నటి రన్యారావు దుబాయ్‌ నుంచి 14 కిలోల బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో అరెస్ట్ అయ్యారు. బంగారం స్మగ్లింగ్‌ జరగకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, తరలింపు మాత్రం ఆగడం లేదు. దుబాయ్‌లో నివసిస్తున్న వారెవరైనా భారత్‌కు వస్తున్నారని తెలిస్తే.. తెలిసినవారు, కుటుంబసభ్యులు అడిగే ప్రశ్న.. ‘వచ్చేటప్పుడు బంగారం ఏమైనా తేవడం సాధ్యమవుతుందా?’