రాధిక బర్త్ డే అంటే.. అట్లుంటది మల్లా.. Actress Neha Shetty Celebrated Her Birthday - Tv9

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ నేహాశెట్టి‏కి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అభిమానులు ఆమె రాధిక అంటూ పిలుచుకుంటుంటారు. అంతగా ఆ పాత్రతో అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్‏గా నటించింది నేహాశెట్టి. ఇందులో రాధిక పాత్రలో కనిపించి తన నటనతో మెప్పించింది. గ్లామర్ రోల్ మాత్రమే కాకుండా కాస్త నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో బిజీ అయిపోయింది. ఇక ఈక్రమంలోనే రెండు మూడు రోజుల క్రితం.. తన బర్త్‌ డే సెలబ్రేషన్స్ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఈ బ్యూటీ.