ఆకస్మిక వరదలతో స్పెయిన్ చిగురుటాకులా వణికిపోయింది. భీకర వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల వల్ల పలువురు మృతి చెందగా అనేకమంది గల్లంతయ్యారు. గల్లంతయినవారిలో కొంతమంది మృతదేహాలు లభించిక అనేక మంది ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి.