విజృంభిస్తున్న జికా వైరస్‌ అప్రమత్తంగా లేకుంటే అంతే

వర్షాకాలం వస్తూ వస్తూ వైరస్‌లను వెంటబెట్టుకుని వస్తుందంటారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు చోట్ల వైరల్‌ఫీవర్స్‌, డెంగీ పంజా విసురుతుండటంతో తాజాగా జికా వైరస్‌ కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటివరకు అక్కడ ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది.