చాలామంది ఎంతోకష్టపడి జీవనం సాగిస్తుంటారు. కష్టపడుతూనే ఉంటారు.. అలాంటి వారి కష్టాన్ని చూసి అప్పుడప్పుడూ అదృష్టానికి కూడా జాలేస్తుందేమో.. అందుకే అప్పుడప్పుడు అలాంటి వారిని పలకరిస్తుంటుంది. అయితే అది ఎప్పుడు...? ఎలా...? అనేది మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే కేరళకు చెందిన ఓ వ్యక్తి లైఫ్‌లో జరిగింది. 11 ఏళ్లుగా యునైడెట్ అరబ్ ఎమిరేట్స్‌లో కష్టపడి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓవ్యక్తిని అదృష్టం లాటరీ రూపంలో పలకరించింది. ఏకంగా అతనికి 45 కోట్ల రూపాయలు గిఫ్ట్‌గా ఇచ్చింది.