థంబ్‌లో కనిపిస్తున్న ఆ బూరె బుగ్గల చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ స్టార్ డమ్ అందుకుంది. బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలతో నటించి అలరించింది. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ఎన్నో చిత్రాల్లో కనిపించింది. అందం, అభినయం, అదృష్టం కలిస్తే ఈ బ్యూటీగా కనిపిస్తుంది. ఇంతకీ ఈవె ఎవరా అని అనుకుంటున్నారా? ఈమె మన కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కాజల్. 2007లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది.