సందీప్ రెడ్డి వంగా..! చూడ్డానికి కాస్త సీరియస్‌గానే ఉంటాడు. మాట్లాడితే.. కొట్టినట్టే మాట్లాడతాడు. అదే సినిమా తీస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ సినిమానే చేస్తాడు. సగటు మనిషి మనస్తత్వాన్ని బట్టలూడదీసి మరీ తన సినిమాల్లో ప్రజెంట్ చేస్తాడు. అందుకే తను కాస్త స్పెషల్ అనే ట్యాగ్.. ఇండస్ట్రీలో ఎప్పుడో వచ్చేలా చేసుకున్నాడు. ఇక మరి కొద్ది రోజుల్లో యానిమల్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అసలైన హింస అంటే ఏంటో.. ఈ సినిమాలో చూపిస్తా అంటున్నాడు. అంతేకాదు ఈ సినిమా తెరకెక్కించడానికి కారణం.. ఆ ఒక్కరే అంటూ.. ఓ త్రోబ్యాగ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే అప్పటి ఆ వీడియోతో ఇప్పుడు అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా..!