అప్పుడు ప్రేమతో..! ఇప్పుడు కోపంతో...! - Tv9

మనీలాండరింగ్ కేసులో అరెస్టయ్యి ఢిల్లీ జైలులో ఉన్న కేటుగాడు సుఖేశ్‌ చంద్రశేఖర్‌ బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ను బెదిరించడం సంచలనం రేపుతోంది. తనపై కోర్టులో కేసులు వేస్తే జాక్వెలిన్‌ గుట్టురట్టు చేస్తానని హెచ్చరించాడు సుఖేశ్‌. జాక్వెలిన్‌ తనను మోసం చేసిందని , ఆమెను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించాడు. జాక్వెలిన్ తనను దెయ్యంలా చూస్తోందని, దెయ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హెచ్చరించాడు. తన మౌనాన్ని బలహీనతగా చూస్తోందన్నాడు. జాక్వెలిన్‌కు తనతో ఉన్న సంబంధాలపై ఆధారాలను కోర్టుకు , దర్యాప్తు సంస్థలకు ఇస్తానని తెలిపాడు.