సొరకాయా.. మజాకా !! బోలెడన్ని ప్రయోజనాలు

సొరకాయ, ఆనపకాయ ఈ పేరు చెబితేనే చాలా మంది పెద్దగా ఇష్టపడరు. సాంబారుకో, పులుసుకో తప్ప ఇంక దేనికీ పనికి రాదనుకుంటారు. కానీ నిజానికి సొరకాయ సౌందర్య పోషణలోనూ, బరువుతగ్గే ప్రక్రియలోనూ చాలా చక్కగా పనిచేస్తుంది.