దక్షిణ గాజా నుంచి పారిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు - Tv9

హమాస్‌ ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌.. తాజాగా దక్షిణ గాజాపై ఫోకస్‌ పెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి వెళ్లిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌ (IDF).. పౌరులు వెంటనే అక్కడినుంచి తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. కానీ... ఎదురుకాల్పుల్లో పౌరులు ఎవరూ చిక్కుకోకూడదని, వారికి ఎలాంటి హానీ కలగకూడదని తాము భావిస్తున్నాం