రైతులు పొలంలో విత్తనాలు నాటినప్పటినుంచి పంట చేతికి వచ్చేవరకూ చంటి బిడ్డలా చూసుకుంటాడు. చీడపీడలు, అడవి జంతువుల బారినుంచి అహర్నిశలు కావలి కాస్తూ రక్షించుకుంటాడు. పంటకు తెగులు వస్తే బిడ్డను అనారోగ్యం చేసినట్టు ఆవేదన చెందుతాడు. మందులతో పిచికారీ చేస్తాడు. పంట ఏపుగా పెరగాలని, మంచి దిగుబడి రావాలని అప్పుచేసి మరీ ఎరువులను వేస్తాడు. కాపుకొచ్చిన పైరును చూసి చేతికందొచ్చిన బిడ్డలా సంతోష పడిపోతాడు. మరి కొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందని, తన కష్టం ఫలిస్తుందని కొండంత ఆశతో ఎదురు చూస్తాడు.