అమెరికాలోని జార్జియాకు చెందిన ఫెర్నాండో క్లస్టర్ విపరీతమైన తలనొప్పికి తాళ్లలేక సెప్టెంబర్ 2022లో ఎమోరీ యూనివర్సిటీ హాస్పిటల్ వెళ్లాడు. అక్కడ వైద్యులు అతడికి బ్రెయిన్‌లో బ్లీడింగ్ కావడం గుర్తించారు. ఆ సమయంలో వైద్యులు ఒత్తడిని తగ్గించేందుకు 6 అంగుళాల పుర్రె ముక్కని తొలగించాలని నిర్ణయించారు. పుర్రె భాగాన్ని మార్చిన రెండు నెలల తర్వాత యథావిధిగా తొలిగించిన భాగాన్ని రీప్లేస్ చేసేందుకు యత్నించగా.. అక్కడ ఇతర రోగుల పుర్రె భాగాలు కూడా ఉండటంతో అందులో అతడిది ఏదో గుర్తించడంలో విఫలమయ్యారు వైద్యులు.