నెలన్నరగా సహజీవనం చేస్తున్న ఓ 26 ఏళ్ల యువతి తన ప్రియుడి చేతిలోనే హతమైంది. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ లోని దబ్రీ స్టేషన్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయాలతో ఉన్న ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.