బాలీవుడ్ సైఫ్ అలీఖాన్ ప్రాణాలను కాపాడిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాకు పంజాబీ గాయకుడు మికా సింగ్ రూ. 1 లక్ష రివార్డు ప్రకటించారు. జనవరి 16న తన బాంద్రా ఇంటిలో దాడికి గురైన తర్వాత తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న సైఫ్‌ను రానా తన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పంజాబీ గాయకుడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆటో డ్రైవర్‌ను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ పెట్టారు.