అన్నయ్య ఆశీర్వాదం తీసుకున్న జనసేనాని.. భావోద్వేగంగా మారిపోయిన వేదిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లి వేదికపై గవర్నర్ సమక్షంలో పవన్ కళ్యాణ్ అనే నేను అని అంటూ ప్రమాణస్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ సహా పలువురు కీలక మంత్రులు, వీవీఐపీలు పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధాన మంత్రి మోదీ వద్దకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.