గెస్ట్ హౌజ్ కు అతిథిగా వచ్చిన కింగ్ కోబ్రా - Tv9

అందమైన విశాఖలో సముద్రతీరాన సువిశాలమైన గెస్ట్ హౌస్ అది. ఎప్పుడైనా ఎవరైనా అతిథులు వస్తే వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఫామ్ హౌస్ లా ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్ ఇది. సాధారణంగా అతిథులకు మాత్రమే ప్రవేశం ఉండే మంగమారిపేట రామాద్రి వద్ద గల గెస్ట్ హౌస్ లోకి ఓ కింగ్ కోబ్రా అతిధిలా ప్రవేశించింది. ఏకంగా బెడ్ రూంలోకి దూరింది. బోర్ కొట్టిందో ఏమో కానీ బుసలు కొట్టడం ప్రారంభించింది. మొదట ఏ శబ్దమో అర్దం కాని ఆ గెస్ట్ హౌజ్ వాచ్ మెన్ తర్వాత అనుమానం వచ్చి గెస్ట్ హౌస్ లోకి తొంగి చూశాడు. ప్రాణాలు పోయేంత పని అయింది.