సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే పోలీసులకు చెబుతాం.. కానీ పోలీసుల ఇళ్ళలోనే దొంగలు పడితే.. వారు ఎవరికి చెప్పుకుంటారు. అదే పరిస్థితి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చోటు చేసుకుంది. పాలకొండలో శుక్రవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు రాత్రికి రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. ముగ్గురు ఇళ్లల్లో చోరీలకు పాల్పడితే బాధితుల్లో దిశ SI తో పాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. పోలీసుల ఇళ్లల్లోనే దొంగతనాలు జరగటం... అది కూడా DSP కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఈ దొంగతనాలు జరగటం పోలీసులకే సవాలుగా మారింది. పాలకొండ DSP కార్యాలయానికి సమీపంలోనే నివాసం ఉంటోన్న దిశ పోలీస్ స్టేషన్ SI లావణ్య వీధుల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రానికి వెళ్ళారు. రాత్రికి పార్వతీపురంలోనే ఉండిపోయారు.