ప్రపంచంలోని అతి పొడవైన మహిళ బ్రెజిల్‌కు చెందిన మరియా శాంటోస్ 77 ఏళ్ల వయసులో కన్ను మూశారు. 'క్వీన్ ఆఫ్ హైట్'గా పేరున్న మరియా అనారోగ్యంతో అరకాజులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నిమోనియాతో బాధపడుతున్న మరియా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మరణంతో బ్రెజిల్ వాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.