న్యూ ఇయర్ వేడుకలు ఆ యువకుల ఇళ్లలో జీవితమంతా తీరని విషాదాన్ని మిగిల్చాయి. సరదాగా విహారయాత్రకు వెళ్ళిన స్నేహతులు రోడ్డు ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ప్రమాదం మహబూబాబాద్ శివారు లోని ఎటిగడ్డతండా వద్ద జరిగింది. కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.