క్రూజ్ షిప్ లో అక్కడి వరకు ప్రయాణం సాఫీగా సాగింది. అంతలోనే భారీ కుదుపులు.. ఎగిసిపడే రాకాసి అలలు .. ఉయ్యాలలా ఊగిన ఓడ .. చుట్టూ గాలి చేస్తున్న భీకర శబ్దాలు.. అప్పటిదాకా షిప్ పైన ఉన్న వారు గదుల్లోకి పరిగెత్తారు. ఓ వైపు మైక్‌లో ఎనౌన్స్‌మెంట్లు.. మరో వైపు వెన్నులో మొదలైన వణుకు, ఊహించిన ఉత్పాతాన్ని నౌక దాటగలదా? యస్ ఇదేమీ అనుకోకుండా జరిగిన సముద్ర ఉత్పాతం కాదు. ముందే ఊహించి ముందే ప్లాన్ చేసిన టూర్. భయంకరంగా ఉండే ఆ అనుభవాన్ని కళ్ళారా చూడాలని ఉవ్విళ్లూరే ధైర్యవంతుల కోసమే ఈ టూర్. ఇంతకీ ఈ అతి ప్రమాదకర సముద్ర ప్రయాణం ఎక్కడ చేస్తారో తెలుసా?