రోడ్డుమీద వాహనాలు రయ్..య్..మంటూ దూసుకెళ్తున్నాయి. సడన్‌గా ముందు వెళ్తున్న వాహనదారుడు బ్రేక్ వేశాడు. ఆ వెనకే అన్ని వాహనాలు ఆగిపోయాయి. ఇంతలో కొందరు యువకులు పెద్ద పెద్ద తాళ్లు పట్టుకొని పరుగులు తీశారు. ఏమై ఉంటుందా అని వాహనదారుల్లో కాస్త కలకలం రేగింది. అయితే వారు ఊహించినంత ప్రమాదమేమీ జరగలేదు. నడిరోడ్డుమీద భారీ మొసలి ప్రత్యక్షమైంది.