ఆదిలాబాద్ కుప్టిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడిపోయింది. నారింజ పండ్లతో వెళ్తున్న లారీ బోల్తాపడటంతో పండ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. గమనించిన స్థానికులు పరుగు పరుగున వచ్చారు. రోడ్డుపై పడిపోయిన నారింజ పండ్లను తీసుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు.