నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయినఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హాయ్ నాన్న సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈసినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నాని సినిమా పై ప్రశంసలు కురిపించింది. ఎమోషనల్ అయింది.