కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి చెప్పక్కర్లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో అటు తమిళ్.. ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్ గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటిస్తున్న ప్రతి సినిమాను ఇటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తన అప్‌కమింగ్ ఫిల్మ్ తుఫానుతో మరో సారి తన ఫ్యాన్స్ ముందుకు వస్తున్నారు ఈ హీరో.