అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యే వరకు వడ్డీరేట్లు తగ్గకపోవచ్చు అన్న అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా బంగారం-వెండిలోకి పెట్టుబడులు తగ్గాయి. గరిష్ఠాన్ని తాకిన ధరలు, అంతే వేగంగా దిగి వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు .. అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల పలికింది. ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం.