1990లో తన గ్లామరస్ రోల్స్‌తో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు బాలీవుడ్ అందాల నటి మమతా కులకర్ణి. చాలా ఏళ్ల తర్వాత ఈ అందాల తార ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా మామూలుగా కాదు.. ఓ సన్యాసినిగా. అవును, మమతా కులకర్ణి ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి కిన్నార్ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠి సమక్షంలో సన్యాసం స్వీకరించారు. కిన్నార్ అఖాడాలో మహామండలేశ్వరిగా గుర్తింపు పొందారు. అయితే దీనిని చాలామంది ఆధ్యాత్మికవేత్తలు, కిన్నార్ అఖాడాకు చెందినవారు వ్యతిరేకించారు. ఇది జరిగిన వారం రోజుల్లోనే మమతపై బహిష్కరణ వేటు పడింది.