బిగ్ అప్డేట్.. దేవర వస్తున్నాడు.. Devara - Tv9

మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న సినిమా దేవర. జనత గ్యారేజ్ సూపర్ హిట్ తర్వాత మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతోంది. దీంతో ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇందులో తారక్ ఊర మాస్ లుక్ అందరికీ కిక్కిచ్చేసింది. సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ గ్లింప్స్‌ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు మరో అప్డేట్ ఇచ్చారు దేవర టీం.