బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మోచేతి సమస్యతో ముంబయిలోని కోకిలా బెన్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా 'దేవర' మూవీ షూటింగ్లో పాల్గొంటున్న సైఫ్.. ఇటీవల షూట్ సమయంలో గాయపడ్డారు. దీంతో ఆయన మోకాలు, భుజానికి గాయాలు కావడంతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అదే రోజు తన భుజానికి శస్త్ర చికిత్స జరిగినట్టు కూడా... బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఇక ఈ క్రమంలోనే భుజానికి కట్టుతో.. తన భార్య కరోనా సమేతంగా... తన ఇంటి దగ్గర కనిపించారు సైఫ్.