చేయని నేరానికి 55 ఏళ్లు జైలు రూ.1200 కోట్లు పరిహారం వీడియో

అతడో ప్రొఫెషనల్ బాక్సర్. అయితే పదవి నుంచి విరమణ పొందిన తర్వాత ఓ చోట ఉద్యోగం చేశాడు. అక్కడే తన యజమాని కుటుంబం హత్యకు గురైతే.. ఇతడే చేశాడంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై న్యాయస్థానం కూడా అతడికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తర్వాత కేసులో లభించిన కొన్ని ఆధారాలతో బాక్సర్‌కు సంబంధం లేదని మరణశిక్షను రద్దు చేసింది. కేసు విచారణను 5 దశాబ్దాలుగా కొనసాగిస్తోంది. కానీ బాక్సర్ మాత్రం జైల్లోనే ఉన్నాడు. దాదాపు 55 ఏళ్ల శిక్ష అనుభివించాక అతుడు నేరం చేయలేదని.. కోర్టు నిర్ధారించింది.