కుండపోత వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్ కాశీ, తూతూకుడి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీవర్షాలతో తిరునల్వేలిలో జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జలపాతాల దగ్గరికి ఎవరిని వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. తిరునల్వేలి జిల్లా నీట మునిగింది. తామరభరణి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పాపనాశనం డ్యామ్‌కు భారీగా వరదనీరు చేరింది. దీంతో అధికారులు పాపనాశనం డ్యామ్ నుంచి నీరు దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.