బంక్ లకు పోటెత్తిన జనం - Tv9

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో ‘హిట్‌ అండ్‌ రన్‌ ’ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వీరు రాస్తారోకోలు, ర్యాలీలు చేపడుతున్నారు. అయితే, డ్రైవర్ల నిరసనతో ఇంధన ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడనుందన్న భయంతో పలు రాష్ట్రాల్లో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌లకు పోటెత్తారు.