ఇకపై దోమలను చంపేయండి ఈజీగా..ఇలా!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. దాంతో దోమల బెడద కూడా ఎక్కువైంది. మరోవైపు సీజనల్‌ వ్యాధులు.. దోమలు కుట్టడంతో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మన టెక్‌ దిగ్గజం ఓ దోమలను చంపే యంత్రానికి సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. అందులో ఓ ఇంట్లో ఫిరంగిని పోలి ఉన్న ఓ చిన్న యంత్రం అటూ ఇటూ తిరుగుతూ లేజర్‌ కిరణాలను ప్రసరింపచేస్తోంది. ఈ కిరణాల కారణంగా ఆ చుట్టుపక్కల ఉన్న దోమలన్నీ చనిపోతున్నాయి.