బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న పాత్రలలో కనిపించినా.. ఈ షోతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే వెండితెరపై కమెడియన్స్గా అలరించిన కొందరు.. దర్శకులుగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జబర్ధస్త్ కమెడియన్ వేణు.. తన డెబ్యూ ఫిల్మ్ 'బలగం'తోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈయన దారిలోనే.. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అతడేవరో కాదు అతడే ధనరాజ్.