హమాస్ - ఇజ్రాయెల్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ... తమ పోరాటం ఆగబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి స్పష్టం చేశారు. హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, తమను ఎవరూ ఆపలేరని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు శుక్రవారం పునరుద్ఘాటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో శుక్రవారం జెరూసలేంలో సమావేశమైన నెతన్యాహు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రమాణం చేసిందని, తాను కూడా ప్రమాణం చేశానని, తమ లక్ష్యం నెరవేరేవరకూ తమను ఏదీ ఆపబోదు అని నెతన్యాహు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ రిపోర్ట్ పేర్కొంది.