ఒక్కసారి చార్జింగ్ తో 8 గంటలు కూలింగ్ అందించే హెల్మెట్లు - Tv9

అసలే మండే వేసవికాలం.. ఆ పై ట్రాఫిక్ పోలీసులు.. ఎండలో పని. వారి కష్టం మామూలుగా ఉండదు. భానుడి భగభగల మధ్య విధులు నిర్వహించాలి. ఎండ వేడిని తట్టుకునేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలి. ఇంతటి కష్టం అనుభవించే ట్రాఫిక్ పోలీసుల బాధను అర్థం చేసుకుని గుజరాత్‌లోని వడోదర పోలీసులు పరిష్కారం కనుగొన్నారు. తమ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్‌లను అందిస్తున్నారు.