ఒక్క రోజుకే రూ.250 కోట్లు..వసూళ్లలో ప్రభాస్ విశ్వరూపం - Tv9

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ‘సలార్ ‘ సునామీ సృష్టిస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్‏లో వసూళ్లు రాబడుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే 400 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఇప్పుడు 500 కోట్లకు చేరువలో ఉంది. ఇక దేశీయ బాక్సాఫీస్ ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 250 కోట్లు మార్క్ ను క్రాస్ చేసి మరో రికార్డ్ బద్దలుకొట్టింది. దీంతో ఇప్పడు సలార్ మేకర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.