రిలయన్స్ ఉద్యోగి గిఫ్ట్‌బాక్స్‌ను అన్‌బాక్స్‌ చేస్తున్న వీడియో వైరల్‌

దీపావళి అంటే వెలుగుల పండుగ.. ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల నడుమ ఇళ్లు, వాకిళ్లు వెలుగులతో నింపి చేసుకునే సంతోషాల వేడుక. ఈ పండుగకు ప్రత్యేకించి అందరూ ఒకరికొకరు బహుమతులు ఇస్తుంటారు. చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులు, సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌ వంటివి ఇస్తుంటాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ ఫౌండేషన్ తమ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్‌ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.