మిగ్జాం తుపాను ప్రభావం తమిళనాడు, ఏపీలతో పాటు తెలంగాణపైనా పడుతోంది. ఇప్పటికే ఆ రెండు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తోంటే.. ఇప్పుడు తెలంగాణలోనూ రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.