అదృష్టం ఎవరి తలుపు తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పలేం. లక్ కొందరి వెన్నంటే ఉంటుంది. వారిని తప్పక అదృష్టం వరిస్తుంది. వందల్లో వేలల్లో లక్షల మందిలో ఒక్కరికే ఆ అదృష్టం పడుతుంది. అది పట్టిందంటే చాలు అప్పటి వరకూ అంటిపెట్టుకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లే. జీవనం వెదుక్కుంటూ దుబాయికి చేరిన ఓ భారతీయుడు తాజాగా యూఏఈ లక్కీ డ్రాలో ఏకంగా రూ.45 కోట్లు గెలుచుకొని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారాడు.