మెక్సికోలో తుఫాను కారణంగా అత్యంత పురాతనమైన ఒక పిరమిడ్ కూలిపోయింది. ఈ నేపధ్యంలో ఇది పెను విపత్తుకు, వినాశనానికి నాంది అంటూ పలు వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆ పురాతన తెగకు చెందిన వారసులు పిరమిడ్లు కూలడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూలిన పిరమిడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిరమిడ్ పాక్షికంగా కూలిపోయి ఉండటం, దానిలో కొంత భాగం కొట్టుకుపోయినట్లు ఉండడం ఈ ఫొటోలలో కనిపిస్తోంది.